రాజమౌళిది అహంకారమా..? ఆధిపత్యం కోసం ఆరాటమా..?

Update: 2020-06-06 20:25 GMT

లాక్ డౌన్ టైమ్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతోన్న అనూహ్య పరిణామాలపై ప్రతిరోజు సాయంత్రం 6.30గంటలకు ఎక్స్ క్లూజివ్ అప్డేట్స్.. ఆన్ టివి5 వెబ్

 

రాజమౌళి.. ఊరమాస్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే దర్శకుడు. అతని సినిమాల్లో గొప్ప కథలు కనిపించవు. ‘ఇన్స్ స్పైరింగ్ సీన్స్’తో మెస్మరైజ్ చేసే ‘టెక్నిక్’ పట్టుకుని టాప్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ హీరోలను లాక్ చేసి వారిని ఇబ్బంది పెట్టడంలో కూడా రాజమౌళి టాప్ డైరెక్టరే అనిపించుకున్నాడు. అయితే కోవిడ్-19, లాక్ డౌన్ మూలంగా అన్ని పరిశ్రమల్లాగానే సినిమా పరిశ్రమలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల్లో భాగంగా ప్రోటోకాల్ దాటుకుని ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నాడు రాజమౌళి. ఇండస్ట్రీలోని అన్ని శాఖల వారూ ఎవరికి వారుగా సమావేశాలు నిర్వహించుకుంటారు. అయితే దానికి ఓ సంఘం ఉంది. దానికి బాధ్యులు ఉన్నారు. వారి సమక్షంలో సమావేశాలు జరగడం న్యాయం. కానీ రాజమౌళి వాటిని ఉల్లంఘించాడు. వేదికలపై వినయంగా ప్రవర్తించే రాజమౌళి వాస్తవంలో మాత్రం అహంభావం చూపుతూ ప్రస్తుతం ఇండస్టీలో ఉన్న ఎందరో దర్శకులను అవమానిస్తూ ఓ ప్రైవేట్ దర్శక దందాకు తెరలేపాడు.

తాజాగా రాజమౌళి పరిశ్రమలోని 25 మంది దర్శకులతో కలిపి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఇందులో ప్రస్తుతం సినిమాలు చేస్తోన్న వారు లేరు. యాక్టివ్ గా ఉన్న దర్శకులు లేరు. ఎప్పుడో ఆవకాయ్ బిర్యానీ వంటి బిలో యావరేజ్ సినిమా తీసిన అనీష్ కురువిల్లా గుర్తున్నాడు. కానీ వరుసగా రెండు హిట్లు కొట్టిన వెంకీ కుడుముల కనిపించలేదు. అసలు ఇంతెందుకు ఈ సమావేశానికి దర్శకుల సంఘం అధ్యక్ష్య కార్యదర్శకులనే పిలవలేదు. దర్శకుల సంఘం బాధ్యుడుగా ప్రతి విషయాన్ని భుజాలపై వేసుకుని బాధ్యతగా ప్రవర్తిస్తోన్న ఎన్ శంకర్ కు ఈ సమావేశానికి ఆహ్వానం లేదు. ఎన్ శంకర్ ను ఆహ్వానించలేదు అంటే ఏవైనా సీక్రెట్స్ లీక్ అవుతాయని సైడ్ చేశారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇండస్ట్రీ రూల్స్ కు భిన్నంగా వ్యక్తిగా గ్రూపులు కడుతూ, దర్శకుల సంఘం ప్రధాన బాధ్యులను కూడా ఆహ్వానించకుండా ఓ ప్రైవేట్ ప్లేస్ లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఒకవేళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ కోసం అనుకున్నా.. మరి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోన్న దర్శకులను ఎందుకు పిలవలేదు. సినిమాలు చేసి విడుదల కోసం ఎదురుచూస్తోన్న దర్శకులు ఎందుకు ఈ మీటింగ్ లో లేరు. అసలు ఈ మీటింగ్ ఉద్దేశ్యం ఏంటీ..? అంటే రాజమౌళి ‘కూడా’ ఇండస్ట్రీని రెండుగా విభజించే కుట్రలు చేస్తున్నాడా అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ దర్శకులంటే ఒక మాటగా ఉన్న సంఘాన్ని ఇలా విడగొట్టి పాలించడం వెనక రాజమౌళి ప్రత్యేక ఉద్దేశ్యాలు ఏంటనేది తేలాల్సి ఉంది. నిజంగా అతను పరిశ్రమ మేలుకోసమే ఇదంతా చేస్తే.. మరి ఇంత సీక్రెట్ గా ఈ సమావేశాన్ని ఎందుకు నిర్వహించాల్సి వస్తోంది.

ఓ వైపు భారీ సినిమా పేరుతో హీరోలను లాక్ చేసి అభిమానుల ఆగ్రహాలకూ గురవుతోన్న రాజమౌళి తనదైన అహంభావంతో ఇప్పుడు ఇండస్ట్రీని రెండుగా చీల్చే పనిలో చాలా బిజీగా ఉన్నాడని.. లాక్ డౌన్ అంతా కొత్త కథలు రాసుకోవడానికి వాడుకుంటే.. రాజమౌళి మాత్రం కొత్త ఎత్తులతో పరిశ్రమను విభజించే కథలు రాసుకున్నాడా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా చాలామంది అవుట్ డేటెడ్ డైరెక్టర్స్ ను కూడా ఆహ్వానించిన ఆ దర్శక ధీరుడు ఎందుకు చాలామంది యాక్టివ్ డైరెక్టర్స్ ను విస్మరించాడనేది ఖచ్చితంగా తేలాల్సిన విషయం. తన మాట వినేవారందరితో కలిసి ఓ కొత్త గ్రూప్ తయారు చేసుకుని.. ఇప్పుడున్న స్ట్రక్చర్ కు భిన్నంగా ‘ప్యారలల్ ఇండస్ట్రీ’ని తయారు చేస్తున్నాడా..? అనే అనుమానాలూ తలెత్తుతున్నాయి. మొత్తంగా రాజమౌళిది అహంకారమో లేక ఆధిపత్యం(ఇదే అయితే ఎవరిపైన అనేది కూడా తేలాలి) కోసం ఆరాటమా అనేది తేలాలి.. లేదంటే ఇలా రోజుకో దర్శకుడు, నిర్మాత తమ అనుకూల బ్యాచ్ లతో మీటింగ్ లు పెట్టుకని పరిశ్రమ స్ఫూర్తిని నాశనం చేస్తారు. ఆ వినాశనం జరగకుండా ఆపాలంటే రాజమౌళి వంటి వారు చేస్తోన్న విపరీత పోకడలను అడ్డుకోవాల్సిందే.

Similar News