ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఢిల్లీ ప్రజల కోసమే రిజర్వ చేశామని తెలిపారు. కరోనా రోగులకు ఆస్పత్రులు సరిపోవడం లేదని గందరగోళం ఏర్పడుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై సర్వే నిర్వహించామని.. 90 శాతం మంది ప్రజల అభిప్రయాల మేరకు ఈ నిర్ణయంతీసుకున్నామని అన్నారు. కానీ, కేంద్రాని చెందిన ఆస్పత్రుల్లో మాత్రం అందరినీ చేర్పించుకుంటారని అన్నారు.
జూన్ చివరి నాటికి 15వేల పడకలు అవసరమవుతాయని.. ప్రభుత్వం ద్వారా నియమించిన ఓ కమిటీ తెలిపిందని అన్నారు. అయితే, అందులో ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇస్తే.. 9వేల పడకలు మూడు రోజుల్లో నిండిపోతాయని అన్నారు. కాబట్టి, న్యూరో సర్జరీ లాంటి ప్రత్యేక శస్త్ర చికిత్రలు చేసే ఆస్పత్రులు తప్ప.. మిగిలిన ప్రైవేట్ ఆస్పత్రులు అన్ని ఢిల్లీ వారికే కేటాయించాలని కేజ్రీవాల్ అన్నారు.