'గూగుల్' లో ఏం వెతుకుతున్నారో ఒకసారి..

Update: 2020-06-09 15:04 GMT

ఏదైనా ఎంత వరకు తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకుంటేనే మంచిది. కాదూ కూడదంటే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అమ్మనీ, అమ్మమ్మనీ అడాగాల్సిన పనేముంది గూగుల్ మాత ఉండగా అని అన్నింటినీ సెర్చ్ చేసేస్తున్నారు ఈ రోజుల్లో యువతీ యువకులు. చేతిలో ఫోనుంది చెప్పేదేముంది ఎవరిష్టం వచ్చినట్లు వారు వాడేస్తున్నారు. ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అయినా జాగ్రత్తగా ఉండమని చెప్పటం పెద్దల ధర్మం. కొన్ని విషయాల సందేహ నివృత్తి కోసం గూగుల్ ని ఆశ్రయించకపోవడమే మంచిదని అంటున్నారు నిపుణులు. మరి ఆ విషయాలేంటో చూద్దాం..

బాంబుల తయారీ.. తెలుసుకోవడం అవసరమా.. వాటిమీద ఆసక్తి చూపుతూ తెగ వెతికేస్తుంటారు గూగుల్ లో. ఇలాంటి పదాలను సెర్చ్ చేస్తే వారిపై సైబర్ డిపార్ట్ మెంట్ ఓ కన్ను వేసి ఉంచుతుంది. ఈ బాంబులు, పేలుడు పదార్ధాలను ఎక్కువగా టెర్రరిస్టులు వాడుతుంటారు. పోలీసులకు ఏ మాత్రం తెలిసినా బుక్కవ్వడం ఖాయం.

మహిళల ప్రసవ వేదన మళ్లీ జన్మ ఎత్తడం లాంటిది. దాని గురించి కూడా గూగుల్ లో సెర్చ్ చేసి చూస్తుంటారు. విషయ పరిజ్ఞానం పెంచుకోవడం మంచిదే కానీ కొన్ని విషయాల గురించి తెలుసుకో పోవడమే మంచిది. అలాంటివి చూడడం వలన మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి.

మాదక ద్రవ్యాల గురించి సెర్చ్.. యువతను పెడదోవ పట్టించే డ్రగ్స్ ని ప్రభుత్వం నిషేధించింది. అయినా కొందరు యువకులు డ్రగ్స్ తయారీ గురించి తెలుసుకునేందుకు గూగుల్ లో వెతికేస్తున్నారు. చిక్కులు తెచ్చిపెట్టే ఇలాంటి విషయాలు తెలుసుకుంటే జీవిత గమ్యం మారిపోతుంది.

మరికొన్ని పదాలను కూడా సెర్చ్ చేయకపోవడమే మంచిది.. అవి బెడ్ బగ్స్, బెల్లీ బటన్ బగ్స్, హంట్స్ మ్యాన్ స్పైడర్, బ్లూ వాఫెల్, క్రొకొడిల్, జిగ్గర్స్, మౌత్ లార్వా, బాట్ ప్లై రిమూవల్ వంటి వాటి కోసం గూగుల్ లో వెతక్కండి. సందేహ నివృత్తి కోసం గూగుల్ లో సెర్చ్ చేయాలనుకున్నా.. ఏం చేస్తున్నామన్నది ఆలోచించుకుని చేస్తే బెటర్.

Similar News