విషమంగా ఎమ్మెల్యే అన్భళగన్‌ ఆరోగ్యం!

Update: 2020-06-09 10:34 GMT

తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్‌ రేల ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ మెడికల్‌ సెంటర్‌ ప్రకటించింది. ఎమ్మెల్యే అన్భళగన్‌ చెన్నై చేపాక్కం –ట్రిప్లికేన్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్దిరోజులుగా కరోనా నివారణ, సహాయక పనుల్లో ఆయన పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆయన ఈనెల రెండో తేదీన ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చేరారు.

అయితే అన్భళగన్‌కు కరోనా పరీక్షలు చేయగా కరోనా నిర్ధారణ అయ్యింది. ఆయనకు క్రోంపేటలోని రేల ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ మెడికల్‌ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం పళనిస్వామి వైద్యులతో మాట్లాడారు. తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్‌ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.

Similar News