ఆస్ట్రేలియాకు చెందిన 25 ఏళ్ల రేనీ గ్రేసీ చిన్నతనంలోనే కార్ రేసింగ్ లో రికార్డులు సాధించింది. అప్పుడు, డబ్బు, పరపతి, గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విధి చేతిలో కీలుబొమ్మగా మారింది గ్రేసి. పరిస్థితులు తారుమారయ్యాయి. బతుకుదెరువు కోసం పోర్న్ స్టార్ గా మారిపోయింది. వి8 సూపర్ కార్ సిరీస్ మొత్తం పూర్తి చేసిన మొదటి మహిళగా గ్రేసీ రికార్డు సాధించింది. అలాంటి గ్రేసీ 2017 నుంచి రేసింగ్ లలో పాల్గొనలేక పోయింది. ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది. దాంతో ఆర్థికంగా చితికిపోయింది. బ్రతుకు భారమైపోయింది. కొన్నాళ్లు కార్ యార్డులో కూడా పని చేసింది. అయినా చాలీ చాలని జీతం. ఆర్ధిక అవసరాలు తీరే మార్గం కనిపించలేదు. డబ్బు సంపాదించే మార్గాలకోసం అన్వేషించింది. ఓ రోజు ఓన్లీ ఫ్యాన్స్ అనే అడల్ట్ వెబ్ సైట్ చూసింది. డబ్బు సంపాదించడానికి పోర్న్ స్టార్ గా మారడమే కరెక్ట్ అని భావించింది. తానీ నిర్ణయం తీసుకునే ముందు ఎంతో ఆలోచించానని తెలిపింది. 'సమాజం నన్ను వేలెత్తి చూపుతుంది. రేసర్ గా రాణించి ఇలాంటి పని చేస్తుందని ఛీ కొట్టే వాళ్లు, ఛీత్కరించుకునే వాళ్లు ఉంటారని నాకు తెలుసు. కానీ నా ఆర్థిక అవసరాలు ఎవరు తీరుస్తారు. నేను కష్టాల్లో ఉంటే అయ్యో పాపం అనే వాళ్లే కాని ఆదుకునే వారు ఒక్కరూ ఉండరు. అందుకే బాగా ఆలోచించే ఈ రంగంలోకి అడుగు పెట్టాను. నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం ఏదైనా ఉందంటే పోర్న్ స్టార్ గా మారడమే' అని గ్రేసీ చెప్పుకొచ్చింది.