పీపీఈ కిట్ లో అందాల తార ఎక్కడికో..

Update: 2020-06-12 15:27 GMT

చిట్టి పొట్టి బట్టలేసుకుని మీడియా కంట పడి నెటిజన్ల చేతిలో చీవాట్లు తినే అమ్మడు ఫుల్లుగా పీపీఈ కిట్ ధరిస్తే అభిమానులకు గుర్తుపట్టడం కొంచెం కష్టమే మరి. ఇంతకీ ఎవరా అని ఆరా తీస్తే రకుల్ ప్రీత్ సింగ్ అని తెలిసింది. సినిమా హీరోయిన్లు ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండేవారు. అలాంటిది 70 రోజుల నుంచి ఇంటి పట్టునే ఉండి కాలక్షేపం చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలతో షూటింగ్ లకు అనుమతులు లభించాయి. దీంతో నటీనటులకు మళ్లీ హడావిడి మొదలైంది. తాజాగా హీరోయిన్ రకుల్ ముంబై విమానాశ్రయంలో పీపీఈ కిట్ ధరించి కనిపించింది. 95 మాస్క్, గ్లోవ్స్, కిట్ ధరిచి కారు దిగి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కింది. బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసమే రకుల్ ఢిల్లీ వెళుతున్నట్లు సమాచారం.

Similar News