నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం..

Update: 2020-06-13 10:42 GMT

కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీలో బలాబలాల ఆధారంగా బీజేపీకి రెండు స్థానాలు దక్కగా, మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీలకు చెరొక స్థానం దక్కింది. శుక్రవారం రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉపసంహరణ తర్వాత.. నాలుగు స్థానాలకు కేవలం నలుగురు మాత్రమే మిగిలివుండటంతో నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులే బరిలో ఉన్నారు. దీంతో నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఈ మేరకు డిక్లరేషన్ కూడా‌ విడుదల చేసింది.

Similar News