ఢిల్లీలో కరోనా ఉదృతిపై అమిత్‌షా సమీక్షా సమావేశం

Update: 2020-06-14 15:31 GMT

దేశ రాజధానిని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ పెద్దయెత్తున కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో ఇప్పటివరకు 38 వేల 958 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 1271 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీ నగరంలో మొత్తం దాదాపు కంటైన్‌మెంట్ జోన్‌గా మారిపోయింది. ఏ కాలనీలో చూసిన వందలకొద్దీ కేసులు నమదవుతూనేవున్నాయి. అటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఢిల్లీలో కరోనా ఉదృతి నేపథ్యంలో కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా కరోనా కట్టడిపై ఇవాళ అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఉన్నతాధికారులతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఢిల్లీలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

Similar News