ఫేస్ మాస్క్ వాడకం వలన కరోనాను చాలా వరకూ కట్టడి చేయవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్టే ఎట్ హోం, సోషల్ డిస్టన్స్ కంటే ఫేష్ మాస్క్ వాడకం కరోనా కట్టడిలో మంచి ఫలితాలు ఇస్తుందని ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీలో ప్రచురించిన అధ్యయనంలో తేలింది. చాలా దేశాలు ఫేస్ మాస్క్ వాడకం తప్పనిసరి చేశాయని.. దీని వలన చాలా వరకు కరోనా కంట్రోల్ అవుతోందని చెబుతుంది. లేకపోతే.. మనం అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు ఉండేవని చెబుతుంది. అమెరికాకు చెందిన పరిశోధకలు పలు ఉదాహరణలతో ఓ నివేదికను విడుదల చేశారు. న్యూయార్క్ లో ఏప్రిల్ 17న ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన తరువాత 66,000 కేసులు తగ్గినట్టు వారిపరిశోధనలో తేలిందని అన్నారు. ఫేస్ మాస్క్ వాడకం తప్పనిసరి చేసిన తరువాత న్యూయర్క్ లో రోజుకి 3శాతం కేసులు తగ్గినట్టు తెలిపారు. అటు, ఇటలీకలో ఫేస్ మాస్క్ వాడకం మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిపారు. సుమారు 78,000 కరోనా కేసులు తగ్గాయని అన్నారు. ఫేస్ మాస్క్ వాడటానికి ముందు నుంచే క్వారంటైన్, సోషల్ డిస్టన్స్ అమలులో ఉన్నాయని.. కానీ, ఫేస్ మాస్క్ తరువాత ఇలాంటి ఫలితాలు వచ్చాయని పరిశోధకులు అన్నారు. సోషల్ డిస్టన్స్, క్వారంటైన్ లాంటివి డైరక్ట్ కాంటాక్ట్ ద్వారా కేసులు అదుపు చేశాయని.. కానీ, కొంత కాలం గాలిలో ఉండే వైరస్ ఇతరులకు సోకకుండా ఫేస్ మాస్క్ రక్షిస్తుందని అన్నారు.