యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలోకి వర్షపు నీరు

Update: 2020-06-14 15:45 GMT

ఇటీవల కురిసిన భారీ వర్షానికి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. దీంతో పంచతల రాజగోపురం, అద్దాల మండపం, అష్టాబుజి, ప్రాకార మండపాల్లో పనులు నిలిచిపోయాయి. మండపాల పైభాగంలో రెయిన్ ప్రూఫ్ గట్టిపడకపోవడంతో లీకేజీలు ఏర్పడ్డాయి. మండపాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రానిక్ వైరింగ్, ఏసీ ఫిట్టింగ్‌ పనులు పూర్తికాకపోవడంతో లీకేజీల ద్వారా వర్షపు నీరు చేరుకుంది. లీకేజీలపై స్థానిక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాణ్యతతో పనులు చేయాలని.. లీకేజీలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.