వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాలంటే..

Update: 2020-06-15 19:43 GMT

కరోనా మన దరి చేరకుండా ఉండాలంటే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవాలని చెబుతున్నారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఒక్కోసారి కొద్దో గొప్పో ఉన్న రోగనిరోధక శక్తి కూడా మన అలవాట్ల ద్వారా బలహీనపడడం కూడా జరుగుతుంటుంది.

ఒత్తిడి రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడికి గురైన వారు త్వరగా జలుబు, ఫ్లూ వంటి వాటి బారిన పడే అవకాశం ఎక్కువ వుంటుంది.

నిద్రలేమి కారణంగా అనేక వ్యాధులు మనపై దాడి చేస్తుంటాయి. రోజుకి కనీసం ఏడుగంటల నిద్ర అవసరం.

డి-విటమిన్ లోపం. సూర్యరశ్మి ద్వారా డి విటమిన్ లభిస్తుంది. ఇది తగినంత లేకపోతే వ్యాధినిరోధక శక్తి బలహీనపడుతుంది. రోజూ ఉదయం పూట ఓ అరగంట ఎండలో నిలబడితే డి విటమిన్ ఉచితంగా లభిస్తుంది.

వ్యాయామం.. ఓ అరగంట వ్యాయామం ద్వారా శరీరంలోని కండరాలు, ఎముకలు గట్టిపడి శరీరం కంట్రోల్ లో ఉంటుంది. వ్యాయామం చేయడం ద్వారా తెల్ల రక్త కణాలు, యాంటీ బాడీస్ వృద్ధి చెందుతాయి.

ఏది పడితే అది తినడం, తాగడం చేస్తుంటారు. దీంతో అనేక వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే. జంక్ ఫుడ్, స్వీట్స్, నూనె వస్తువులు, ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల ఉపయోగం లేకపోగా నష్టం ఎక్కువగా ఉంటుంది.

సిగరెట్లు, మధ్యం వంటి దురలవాట్లు రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి.

Similar News