భారత్ వైద్య విద్య పరిశోధన మండలి కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయనే ఆరోపణలు రావడంతో తొలి యాంటిజెన్ కరోనా టెస్టు కిట్లకు అనుమతి ఇచ్చింది. ఈ కిట్లతో కరోనా టెస్టులు సంఖ్య పెద్ద ఎత్తున పెంచవచ్చు. ప్రస్తుతం భారత్ లో ప్రతీ రోజు లక్ష 20 వేల నుంచి లక్ష 50 వేల వరకూ టెస్టులు జరుగుతున్నాయి. అయితే, దీనిని మరింత పెంచాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. దీంతో ఈ టెస్టు కిట్లుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కరోనా పరీక్షలకు ఆర్‌టీ-పీసీఆర్ కిట్లు వాడుతున్నారు. వీటి ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. కనీషం 2500 రూ. ఖర్చు అవుతోంది. దీంతో కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతోంది. కానీ, కేవలం 500 రూపాయల ఖర్చుతోనే.. యాంటిజెన్ కరోనా టెస్టు కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు.