ఖతార్ లో కరోనా మహమ్మారి.. 80 వేలు దాటిన కేసులు

Update: 2020-06-17 14:32 GMT

గల్ఫ్ దేశ వాసులనూ కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇప్పటికే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల మార్కును దాటింది. ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ, ఖతార్ లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఖతార్ లో కోవిడ్ కేసుల సంఖ్య 80 వేలు దాటి పోయింది. మంగళవారం ఒక్కరోజే ఖతార్ లో 1,201 కొత్త కేసులు నమోదవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 82,077 అని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనాతో మరణించగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 80కి చేరుకుందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 4.46 లక్షలు కాగా బాధితుల సంఖ్య 80 లక్షలు దాటింది.

Similar News