తమిళనాడు సీఎం పళని స్వామి కార్యాలయ కార్యదర్శి దామోదరం కరోనాతో మృతి చెందారు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అత్యున్నత స్థాయి అధికారి కరోనాతో మరణించడం రాష్ట్ర ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. తమిళనాడులో కరోనా మహమ్మారి రాష్ట్ర ప్రజలను వణికిస్తోంది. పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర సెక్రటేరియట్ లో 200 మంది ఉద్యోగులు కరోనా బారిన పడినట్లు సమాచారం. వీరిలో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.