కరోనా ఎఫెక్ట్: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి మార్పు

Update: 2020-06-18 17:05 GMT

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కు కరోనా పాజిటివ్ రావడంతో.. ఆ శాఖను ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ప్రభుత్వం కేటాయించింది. ఏ శాఖ లేకుండానే సత్యేంద్ర జైన్.. మంత్రిగా కొనసాగుతారని ప్రభుత్వం ప్రకటించింది. అటు, మనీష్ సిసోడియా ఉపముఖ్యమంత్రిగా ఉంటూనే.. విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశాఖ బాధ్యతలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది.

కాగా, తీవ్రం జ్వరంతో బాధపడుతున్న మంత్రి సత్యేంద్ర జైన్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా ముందు నెగెటివ్ రాగా.. రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసింది.

Similar News