జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. 8 మంది ఉగ్రవాదులు హతం

Update: 2020-06-19 17:19 GMT

జమ్ముకశ్మీర్‌లో 8మంది ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నా.. ఎట్టకేలకు శుక్రవారానికి మొత్తం టెర్రరిస్ట్‌లను మట్టుపెట్టారు. పుల్వామా, సోపియాన్‌ జరిగినలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్లతో కలిపితే.. ఈ రెండు వారాల్లో మొత్తం 25 మంది చచ్చారు. పుల్వామా జిల్లా అనంతపొరాలోని పాంపోర్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో టెర్రరిస్ట్‌లు ఉన్నట్టు పక్కా సమాచారం అందింది. భద్రతా దళాలు చుట్టుముట్టడంతో వారు కాల్పులు జరిపారు. అక్కడే ఒక ఉగ్రవాది తూటాలకు నేలకూలాడు. మరో ఇద్దరు తప్పించుకున్నారు. దగ్గర్లో ఉన్న మసీదులో దూరారు. ఎంతకూ వారు బయటకు రాకపోవడంతో సరెండర్ కావాలని పదేపదే హెచ్చరించారు. ఐనా వాళ్లు లొంగకపోవడంతో టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. దట్టమైన పొగకు తట్టుకోలేక బయటకు వచ్చే క్రమంలో టెర్రరిస్ట్‌లు కాల్పులు జరిపారు. చివరికి ఎన్‌కౌంటర్‌లో ఇద్దరూ ఖతమయ్యారు. ఈ ఉగ్రవాదులంతా లష్కరే తోయిబాకి చెందిన వారిగా గుర్తించారు. మసీద్‌ పవిత్రతకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రీయ రైఫిల్స్‌, CRPF ఆపరేషన్ పూర్తి చేయడంపట్ల మసీద్ కమిటీ సంతోషం వ్యక్తం చేసింది. అటు, సోపియాన్‌లో కూడా నిన్నటి నుంచి కొనసాగిన ఎన్‌కౌంటర్ ముగిసింది. భద్రతా దళాలు ఐదుగుర్ని మట్టుపెట్టాయి.

Similar News