రోజుకి కొన్ని లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చే రైళ్ల రాకపోకల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్యాసింజర్ రైళ్ల సంఖ్యను తగ్గించడమో లేదా పూర్తిగా తొలగించడమో చేయాలనుకుంటోంది రైల్వే శాఖ. రానున్న రోజుల్లో ఇక అన్నీ ఎక్స్ ప్రెస్ రైళ్లే దర్శనమివ్వనున్నాయి. అంతే కాదు ముందు ముందు స్టాపుల సంఖ్యను కూడా భారీగా తగ్గించే అవకాశం ఉంది. ప్రత్యేకించి చిన్న పట్టణాలు, గ్రామాల్లో స్టాపులు ఉండకపోవచ్నని సమాచారం.
ఒకవేళ పాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లైతే.. సికింద్రాబాద్-రేపల్లె, గుంటూరు-డోన్, విశాఖ-మచిలీపట్నం, విజయవాడ-విశాఖపట్నం, కర్నూలు-తిరుపతి, గుంతకల్-హైదరాబాద్ లలో పాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. వీటన్నింటినీ రానున్న రోజుల్లో రద్దు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద 62 పాసింజర్ రైళ్లు ఇక ఎక్స్ ప్రెస్ సర్వీసులుగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. 200 కిలోమీటర్లు దూరం దాటిన పాసింజర్ రైళ్లన్నింటినీ ఎక్స్ ప్రెస్ సర్వీసులుగా మారనున్నాయి.