గొప్పోళ్లండి బాబు.. పాముకి నీళ్లు పట్టిస్తున్నారు.. వీడియో వైరల్

Update: 2020-06-19 16:08 GMT

పాముకి స్నానం చేయిస్తూ ఒకరు.. నీళ్లు పట్టిస్తూ మరొకరు.. ఏం ధైర్యం.. పాముని చూస్తే ఆమడ దూరం పరిగెట్టేస్తాం.. అలాంటిది అర చేతిలో నీళ్లు తీసుకుని ప్రేమగా పాముకి అందిస్తున్నారు. నిజంగా మహానుభావులు వాళ్లు. కొన్ని పాములు ఏం చేయక పోవచ్చు. కానీ ఎందుకో పాముని చూస్తే అందరికీ భయమే. చాలా వరకు పాములు విషసర్పాలే మరి. కాటు వేయడం మాత్రమే తెలిసిన వాటిని కూడా మచ్చిక చేసుకుంటే మంచిగా అయిపోతాయేమో. ఓ పాము నీళ్లు తాగే వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. పాము ఓ మనిషి అరచేతిలోని నీటిని నాలుకతో తాగడానికి ప్రయత్నిస్తోంది. సాధ్యం కాకపోయినా తన ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోలేదని నందా ట్వీట్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది.

 

Similar News