కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5 కోట్ల ఆర్థికసాయం

Update: 2020-06-19 21:41 GMT

గాల్వాన్ లోయలో చైనా దాడిలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. దీంతో పాటు ఇంటి స్థలం, సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. అటు, సంతోష్ బాబుతో పాటు చనిపోయిన మిగత 19 మంది వీరసైనికుల కుటుంబాలకు కూడా 10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని కేసీఆర్ అన్నారు. ఈ ఆర్థికసాయాన్ని కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని అన్నారు.

Similar News