కండ్ల కలక కూడా కరోనా లక్షణమేనట..

Update: 2020-06-19 18:53 GMT

కండ్ల కలక వస్తే కూడా కొవిడ్ లక్షణంగా అనుమానించాల్సిందే అంటున్నాయి కొన్ని పరిశోధనలు. ఇప్పటి వరకు జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధ వ్యాధులు ఉంటేనే కొవిడ్ లక్షణాలుగా భావించేవారు. అయితే కండ్ల కలక కూడా కొవిడ్ ప్రాథమిక లక్షణాల్లో ఒకటని పరిశోధకులు గుర్తించారు. కెనడియన్ జర్నల్ ఆఫ్ ఆప్తమాలజీలో ప్రచురించిన ఓ అధ్యయనంలో ఈ మేరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మార్చిలో ఓ మహిళ తీవ్రమైన కళ్లకలక సమస్యతో రాయల్ అలెక్సాండ్రా ఆస్పత్రికి వచ్చింది.

కంటి సమస్యతో పాటు ఆమెకు కొద్ది మేర ఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంది. వైద్యులు కంటికి చికిత్స అందించినా ప్రయోజనం కలగలేదు. దాంతో వారికి అనుమానం వచ్చి కొవిడ్ టెస్ట్ చేశారు. ఆమెకి కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. వైరస్ లక్షణాలు ఏమీ లేకపోయినా ఒక్క కండ్ల కలక మాత్రమే ఉన్నా కొవిడ్ లక్షణంగా పరిగణించాల్సి వచ్చిందని యూనివర్సిటీ ఫ్రోఫెసర్ కార్లోస్ సోలార్టే పేర్కొన్నారు. ఇటీవల వెలువడిన పలు అధ్యయనాల్లో దాదాపు 10 నుంచి 15 శాతం మందికి కంటి కలక కూడా కొవిడ్ లక్షణంగా గుర్తించారు.

Similar News