పూర్వాపరాలు విచారించకుండానే రథయాత్రను రద్దు చేస్తామంటే ఎలాగ అంటూ కొన్ని వర్గాలు 17 సవరణలతో కూడిన పిటిష న్లను సుప్రీం కోర్టుకు దాఖలు చేశాయి. దీంతో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రథయాత్ర నిర్వహిస్తే ఆ దేవుడు కూడా క్షమించడు అంటూ గతంలో వ్యాఖ్యానించిన ధర్మాసనం పిటిషన్లను పరిశీలించిన మీదట రథయాత్రకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రథయాత్ర సాగాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు రాకుండా చూసుకోవాలన్నారు. జూన్ 18న ఇచ్చిన తీర్పును సవరించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సుప్రీం తీర్పుతో సంతోషించిన దేవస్థానం అధికారులు ఈనెల 23న జరిగే జగన్నాథుని రథయాత్రకు ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.