చైనా వస్తువులను బహిష్కరించాలని కేంద్రమే తీర్మానం చెయ్యొచ్చుకదా : సీపీఐ నారాయణ
చైనా వస్తువులను బహిష్కరించాలని కేంద్రమే అధికారంగా తీర్మానం చెయ్యొచ్చుకదా అంటూ సీపీఐ నారాయణ ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయం తీసుకోకుండా.. కేంద్ర మంత్రులు మాత్రం చైనా వస్తువులను బహిష్కించాలని పిలుపునివ్వడం ఏంటని అన్నారు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడం కాదా.. మోసం చేయడం కాదా అంటూ ప్రశ్నించారు. మోదీని ఒప్పించి కేంద్ర ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకునేలా చేయాలన్నారు. అంతేకానీ మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్లో ఆవేశాలు రెచ్చగొట్టొద్దన్నారు సీపీఐ నారాయణ.