కరోనాకి పతంజలి మెడిసిన్ వచ్చేసింది..

Update: 2020-06-23 15:41 GMT

కరోనాకి మందులు మార్కెట్లోకి బోల్డన్ని వచ్చేస్తున్నాయి. మరి ఇవి ఎంత వరకు కరోనాని కట్టడి చేస్తాయో చూడాలి. ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి.. తన ఆయుర్వేద ఉత్పత్తులను ఉపయోగించి కొరోనిల్ పేరుతో కరోనా వైరస్ కి మందును కనిపెట్టి మార్కెట్లోకి తీసుకువచ్చింది. సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ ఈ విషయాన్ని వెల్లడి చేస్తూ హరిద్వార్ లోని యోగ్ పీఠ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాందేవ్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇలాంటి విపత్కర సమయంలో ఆయుర్వేద మెడిసిన్ కొరోనిల్ తీసుకురావడం ఓ మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఈ మెడిసిన్ తో కరోనాను నయం చేయవచ్చు. మూడు రోజుల పరిశీలనానంతరం 69 శాతం మందికి నెగిటివ్ రావడం శుభపూచకం. అలాగే 7 రోజుల్లో వంద శాతం మంది కోలుకున్నారు. ఈ మందును తీసుకురావడంలో మా శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయం అని రాందేవ్ అన్నారు. ఈ మాత్రల ద్వారా 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు.

Similar News