రూ.5వేలే విత్ డ్రా.. ఆర్బీఐ కీలక నిర్ణయం

Update: 2020-06-23 18:26 GMT

కరోనా కారణంగా ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏటీఎం ఛార్జీలను మరింత పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎం ట్రాన్సాక్షన్ లో రూ.5వేలు మాత్రమే విత్ డ్రాకు అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అంతకు మించి డ్రా చేస్తే అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సంస్కరణలు ప్రతిపాదించింది. ఏటీఎంలలో జరిపే అన్ని లావాదేవీలపై ఇంటర్ ఛేంజ్ ఛార్జీలను పెంచాలని సూచించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలకు ఇది వర్తించేలా చేయాలని ఆర్బీఐని కోరింది. 10 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏటీఎం ఛార్జీలు పెంచాలని నివేదికలో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ కమిటీ నివేదిక అమలుకే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇదే కనుక జరిగితే ఏటీఎం యూజర్లపై కొంత భారం పడే అవకాశం ఉంది.

Similar News