కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు ఇవే..

Update: 2020-06-24 18:18 GMT

బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. అందులో ముఖ్యంగా దేశంలోని సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొచ్చే ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదించినట్టు వెల్లడించారు.

అంతేకాదు ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఓబీసీ కులాల వర్గీకరణ కమిటీ గడువు మరో 6 నెలలు పొడిగింపు, పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటు వంటి వాటికి ఆమోదం తెలిపింది.

Similar News