ఇస్రోలో ప్రైవేట్ పెట్టుబడులపై ఆ సంస్థ చీఫ్ కే. శివన్ కామెంట్స్

Update: 2020-06-25 17:28 GMT

భారత అంతరిక్షరంగంలోకేంద్రం ప్రైవేట్ పెట్టుబడులను స్వాగతించడంతో ఈ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చని అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చీఫ్ కే. శివన్ అన్నారు. అంతరిక్షరంగంలోని ఈ సంస్కరణలు కొత్త శకానికి నాంది పలుకుతాయని అన్నారు. ప్రభుత్వం అంతరిక్షరంగంలో ఎన్నో స్పూర్తివంతమైన సంస్కరణలు చేసిందని అన్నారు. ప్రైవేట్ పెట్టుబడులతో యువతకు మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఇప్పటికే ఎన్నో స్టార్ట్ అప్ కంపెనీలు అంతరిక్షరంగంలో ప్రవేశించేందుకు సిద్దంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అంతరిక్షరంగంలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ అంతరిక్షరంగంలో భారత్ ఓ హబ్ మార్చేందుకు ప్రైవేట్ సంస్థలు రావాలని పిలుపునిచ్చారు. ఈరంగం అభివృద్ధి చెందింతే.. అన్న విధాలా దేశం ముందంజలో ఉంటుందని ఆయన అన్నారు.

Similar News