సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల పరీక్షా ఫలితాలను జూలై నెలలో విడుదల చేయనుంది. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు cbseresults.nic.in లేదా cbse.nic.in యొక్క అధికారిక వెబ్‌సైట్‌లకు లాగిన్ అయిన తర్వాత 'సిబిఎస్‌ఇ క్లాస్ 10, క్లాస్ 12 ఫలితాలు 2020' పై క్లిక్ చేయాలి.
మీ రోల్ నంబర్, సెంటర్ నంబర్, స్కూల్ నంబర్ మరియు అడ్మిట్ కార్డ్ ఐడిని నమోదు చేయాలి. అనంతరం
Submit పై క్లిక్ చేయాలి. సిబిఎస్‌ఇ ఫలితాలు 2020 స్క్రీన్ పై కనిపిస్తాయి. మార్కుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకొని పెట్టుకోవాలి.
అధికారిక సిబిఎస్‌ఇ వెబ్‌సైట్ల జాబితా..
cbseresults.nic.in
cbse.nic.in
results.nic.in
బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్ లోనే కాకుండా, సిబిఎస్‌ఇ క్లాస్ 10, క్లాస్ 12 ఫలితాలు 2020 డిజిలాకర్ మరియు ఉమాంగ్ యాప్‌లో విడుదల చేయబడతాయి. అలాగే, ఫలితాలు గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ లలో లభిస్తాయి.