కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వచ్చారు. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. గతంలోనే ఈ కేసుకు సంబంధించి అహ్మద్ పటేల్ కు నోటీసులు ఇచ్చారు. కాని కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆయన విచారణకు హాజరుకాలేదు..
ఈ క్రమంలో అధికారులు ఆయన నివాసానికి స్టేట్మెంట్ నమోదు చేశారు. స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ ఆంధ్ర బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రూ .5 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుంది.. అయితే ఇందులో అవకతవకలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లు సందేశర సోదరులు నితిన్, చేతన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.