బుల్లెట్ నడుపుతూ కింద పడ్డ టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్

Update: 2020-06-28 15:43 GMT

సరదగా బైక్ నడపాలని ప్రయత్నించి అదుపు తప్పి కింద పడిపోయింది ఓ టాలీవుడ్ హీరోయిన్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరూ అని ఆలోచిస్తున్నారా..! 'జెర్సీ' మూవీలో నానీకి జోడిగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్. ఆమె బైక్ నడుపుతూ కిందపడిపోయిన వీడియో.. నెట్టింట్లో ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. అయితే ఈ ఘటన జరిగి మూడు సంవత్సరాలు అయింది. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది.

కాగా ఈ వీడియోను శ్రద్ధా షేర్ చేస్తూ కామెంట్ చేసింది. ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ మూవీ షూటింగ్‌‌లో ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందని పోస్ట్ చేసింది. '2017లో నందిహిల్స్‌లో షూట్ జరుగుతున్న సమయంలో డైరెక్టర్ రవికాంత్ నాకు బుల్లెట్ నడపడం వచ్చా అని అడిగారు. బైక్ డ్రైవింగ్ తనకు రాదని.. అయినా ట్రై చేస్తా అంటూ చెప్పా.. వెంటనే అక్కడ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకుని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే మలుపు తిప్పే క్రమంలో బ్యాలెన్స్ ఆగక కిందపడిపోయా.. మెల్లగా పడటంతో ఏమీ కాలేదు' అని పోస్ట్ చేసింది శ్రద్ధా.

ఇప్పుడు ఈ వీడియోను.. నెటిజన్లు తెగ షేర్ చేస్తూ.. ఫన్నీ కామెంట్స్ పెడుతూ శ్రద్ధా శ్రీనాథ్‌ని ఆట పట్టిస్తున్నారు.

 

Similar News