మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్టౌన్ ను జూలై 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 5 లక్షల కరోనా కేసులు ఉంటే అందులో లక్షకేసులు మహారాష్ట్రలోనే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో లాక్డౌన్ పొడిగించి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనుకుంటోంది సర్కారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారు 7,429 మంది. ప్రస్తుత పాజిటివ్ కేసులు 70,622 గా నమోదయ్యాయి.