ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న మహమ్మారి

Update: 2020-07-01 15:11 GMT

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతీరోజు నమోదవుతున్న కేసులతో ప్రపంచ దేశాలు భయాందోళనలకు గురవుతున్నాయి. అటు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 1,05,86,381 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 57,95,755 మంది కోలుకున్నారు. 5,13,925 మంది కరోనాతో మృతి చెందారు. అమెరికాలో కరోనా విజృంభణ మరింత వేగంగా కొనసాగుతోంది. అక్కడ 27,27,853 కరోనా కేసులు నమోదవ్వగా.. 1,30,122 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 11,43,334 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే, అమెరికా వైద్యశాఖ అదికారులు కరోనా నిర్మూలన తమ వల్ల కాదని చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. ఈ అంటు వ్యాధిని అరికట్టకపోతే.. రోజు లక్ష మరణాలు సంభవించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ మహమ్మారి ప్రభావం ఆరోగ్యం పైనే కాకుండా.. ఆర్థిక వ్యవస్థపై కూడా పడిందని అంటున్నారు.

Similar News