నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఓలీపై పెరుగుతున్న ఒత్తిడి

Update: 2020-07-01 09:19 GMT

నేపాల్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని కేపీ ఓలీ శర్మను సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఈ డిమాండ్ వినిపిస్తున్నా.. తాజాగా మరింత పెరిగాయి. కమ్యనిస్టు పార్టీముఖ్య నేతలైన పుష్ప కమల్ దహల్, మాధవ్ కుమార్ నేపాల్, జలనాథ్ ఖనల్ లు ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని నిర్మొమాటంగా చెబుతున్నారు. సమర్థవంతమైన నాయకత్వం అందించిడంలోఆయన విఫలమయ్యారని.. పార్టీ పగ్గాలను కూడా సరైన నేతకు అందించాలని తేల్చి చెప్పారని తెలుస్తుంది. ఓలీ నివాసంలో జరిగిన పార్టీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో ఇలాంటి అభిప్రాయాలుబయటపెట్టారు. ఈ సమావేశానికి 18 మంది నేతలు హాజరవగా... 17 మంది ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టినట్టు తెలుస్తుంది. ఓలీ ఇటీవల తనను ప్రధాని పదవి నుంచి తొలగించడానికి భారత్ కుట్ర చేస్తుందని ఆరోపించిని సంగతి తెలిసిందే.

Similar News