పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు యూరప్ ఆరు నెలలు నిషేధం

Update: 2020-07-01 00:38 GMT

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు యూరోపియన్ యూనియన్ షాక్ ఇచ్చింది. రానున్న ఆరునెలు పాటు యూరప్ లో ఈ ఎయిర్ లైన్ కు సంబందించిన విమానాలు అనుమతించమని తెలిపింది. పాకిస్థాన్ పైలట్ల పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. భద్రతా జాగ్రత్తల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది జూలై నుంచి డిశంబర్ 31 వరకూ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. కరాచీలో జరిగిన విమాన ప్రమాదానికి పలు ఆశ్చర్యకర కారణాలు బయటకు వస్తున్నాయి. పాకిస్థాన్ లో 860 పైలట్లలో 262 మంది పైలట్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడారని తేలింది. ఫేక్ లైసన్స్‌లున్న కొందరు పైలట్లపై చర్యలు తీసుకున్నట్లు పాక్ చెబుతున్నా ప్రపంచ దేశాలు నమ్మడం లేదు. ఈయూ నిర్ణయంతో ఇమ్రాన్ సర్కారు షాక్‌కు గురైంది.

Similar News