కొత్త విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల

Update: 2020-07-03 15:31 GMT

కొత్త విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ ను అఖిల భారత సాంకేతిక విద్యామండలి విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఫస్టియర్ లో చేరే విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి.. ఇతర విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని గతంలో ఏఐసీటీఈ ఉత్వర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న వేళ క్యాలెండర్ ను సవరించి ప్రకటించింది. సవరించిన క్యాలెండర్ ప్రకారం ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో మొదటి ఏడాది తరగతులు సెప్టెంబర్ 15 నుంచి.. మిగతా విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 30లోగా మొదటి దశ, సెప్టెంబర్ 10లోగా రెండోదశ కౌన్సిలింగ్ పూర్తి చేయాలని ఏఐసీటీఈ తెలిపింది.

 

Similar News