మోదీ లద్దాఖ్ పర్యటనపై స్పందించిన చైనా

Update: 2020-07-03 17:46 GMT

ప్రధాని మోదీ లద్దాఖ్ పర్యటనపై చైనా స్పందించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చర్యలు ఉండాలని.. పరిస్థితులు వేడెక్కేలా ఉండకూడదని చైనా విదేశాంగశాఖ ప్రతినిథి జావో లిజయన్ అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్యపరమైన, సైనిక పరమైన చర్చలు జరుగుతున్నాయని అన్నారు. కాగా.. ప్రధాని మోదీ శుక్రవారం అకస్మాత్తుగా పర్యటించిన సంగతి తెలిసిందే. భారత సైనికుల ధైర్య సాహసాలను కొనియాడారు. అమరవీరులకు నివాళి అర్పించారు. మోదీతోపాటు బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవాణే కూడా ఉన్నారు.

Similar News