విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల కంటే సైనికుల సాహసాలు ఎత్తైనవి: మోదీ

Update: 2020-07-03 17:31 GMT

లడక్ లో ఆకస్మిక పర్యటన చేసిన ప్రధాని మోదీ.. సైనికుల ధైర్యసాహసాలను కొనియాడారు. సరిహద్దుల్లో భారత సైనికులు చూపించిన సాహసాలు ప్రదర్శించి.. భారత్ సత్తా ప్రపంచానికి చూపించారని అన్నారు. సైనికుల విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల కంటే వారి సాహసాలు చాలా ఎత్తైనవని అన్నారు. సైనికులు చూపిస్తున్న ధైర్యసాహసాలతో ఆత్మ నిర్భర్ భారత్ మరింత పటిష్టమవుతోందని అన్నారు. సైనికులు చూపిస్తున్న చొరవ గురించి మాట్లాడకుండా ఉండలేమని అన్నారు. అమరవీరులకు మరోసారి నివాళులు అర్పించారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయాన్ని మూడు సార్లు పెంచామని గుర్తు చేశారు. మహిళా సైనికులను కూడా ప్రశంసించారు. ఆయనతో పాటు త్రిదళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణే ఆయన వెంట ఉన్నారు.

Similar News