ముంబైలో భారీ వర్షాలు..

Update: 2020-07-03 16:31 GMT

రుతుపవనాల కారణంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నవీ ముంబై, పన్వెల్, థానే మరియు పాల్ఘర్ సహా పలు నగర ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. రాబోయే 48 గంటల్లో నగరంలో 'భారీ వర్షాలు' పడతాయని భారత వాతావరణ పరిశోధనా సంస్థ చెప్పినందున ముంబై పోలీసులు పౌరులను తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని సూచించారు. భారత వాతావరణ శాఖ (ఐఎండి) శుక్రవారం మరియు శనివారం ముంబై, థానే ప్రజలకు హెచ్చరికలను జారీ చేసింది. మత్స్యకారులు జూలై 3 మరియు జూలై 4 న మహారాష్ట్ర-గోవా తీరం వెలుపల సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఉత్తర కొంకణ్ ప్రాంతంలో వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజుల్లో మహారాష్ట్రలో, జూలై 3, 4 తేదీలలో కొంకణ్, గోవా.. జూలై 4 న మధ్య మహారాష్ట్రపై భారీ వర్షప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 200 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం

నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Similar News