దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి జవాన్లను కూడా కలవరపెడుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడిస్తున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
గడిచిన 24 గంటల్లో మరో 34 మంది బార్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా 33 మంది కోలుకున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ ప్రాణాంతకర వైరస్ బారిన పడి 817 మంది కోలోకున్నారు. ఇంకా 526 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు బీఎస్ఎఫ్ ఉన్నత స్థాయి అధికారులు తెలియజేశారు