బీహార్ సీఎం నితీష్ కుమార్ కరోనా పరీక్షలు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకార కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ అవధేశ్ నారాయణ్ సింగ్ లో కలిసి నితీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. అయితే, అవధేశ్ నారాయణ్ సింగ్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. దీంతో నితీష్ కుమార్ కూడా కరోనా పరీక్షలు చేసుకున్నారు. కానీ, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతీ ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని నితిష్ ఆదేశించారు.