సామాన్యులతో పాటు అధికారులు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వైరస్ నివారణకు కఠిన చర్యలు అవలంభిస్తున్నా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా నోయిడా పట్టణంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. గౌతమ్ బుద్ధ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీస్ దీపక్ ఓహ్రికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఓహ్రి గత వారం కంటైన్ మెంట్ జోన్లను సందర్శించడంతో కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.