తిరుమల శ్రీవారి సన్నిధిలో కరోనా కేసులు పెరుగుతుండడం భక్తులను, అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. భక్తులకు సేవలందించే దేవస్థానం సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. మూడు నెలల అనంతరం తెరుచుకున్న స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిట లాడుతోంది. ఈ నేపధ్యంలో స్వామి వారి సన్నిధికి వచ్చే భక్తుల నమూనాలను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం రోజుకి 13వేల మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. భక్తులకు అలిపిరి సమీపంలో పరీక్షలు నిర్వహించిన అనంతరమే దర్శనానికి అనుమతిస్తున్నారు. అయినా గడిచిన వారం రోజుల్లో ఆలయ సిబ్బంది 17 మంది కరోనా బారిన పడ్డారు. అయితే భక్తుల ద్వారా వ్యాధి సంక్రమించలేదని అధికారులు భావిస్తున్నారు. సిబ్బందికే పరీక్షలను నిర్వహించాలని అనుకుంటోంది. ప్రస్తుతం భయపడాల్సిన పనేమీ లేదని అధికారులు అంటున్నారు.