దేశరాజధానిలో లక్షదాటిన కరోనా కేసులు

Update: 2020-07-06 18:00 GMT

ఢిల్లీలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. మొత్తం కేసులు లక్ష మార్కును దాటాయి. దీంతో సీఎం కేజ్రీవాల్ ప్రజల్లో దైర్యం నింపేందుకు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కరోనా కేసులను చూసి ఎవరూ బయపడొద్దని అన్నారు. లక్ష కేసులు దాటినా.. 72 వేల మంది డిశ్చార్జ్ అయ్యారని ఆయన చెప్పారు. ఇంకా 25 వేల మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని అన్నారు. మరణాల రేటు గణనీయంగా తగ్గిందని తెలిపారు. 25 వేలలో 15వేల మంది ఇంటిదగ్గరే చికిత్స పొందుతున్నారని.. ఆస్పత్రిలో 10వేల మంది మాత్రమే ఉన్నారు.

Similar News