ఏటీఎంలో మంటలు

Update: 2020-07-06 17:49 GMT

అహ్మదాబాద్‌‌లోని సీటీఎం ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News