అమెరికా నుంచి లుపిన్‌ ఔషధం వెనక్కి..

Update: 2020-07-08 12:52 GMT

అమెరికా నుంచి మెట్‌ఫార్మిన్‌ హైడ్రోక్లోరిన్‌ ఎక్స్‌టెండెడ్‌ ట్యాబ్లెట్లను వెనక్కి తీసుకున్నట్టు ఔషధ తయారీ కంపెనీ లుపిన్‌ వెల్లడించింది. NDMA అశుద్ధ స్థాయిలపై యూఎస్‌ఎఫ్‌డీఏ చర్యలకు అనుగుణంగా ఈ ట్యాబ్లెట్లను వెనక్కి తీసుకున్నట్టు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది.

అమెరికాలో మెట్‌ఫార్మిన్‌ హైడ్రోక్లోరిన్‌ ఎక్స్‌టెండెడ్‌ ట్యాబ్లెట్లను లుపిన్‌ అనుబంధ సంస్థ విక్రయిస్తోంది. అయితే భారత్‌లో మాత్రం మెట్‌ఫార్మిన్‌ ఉత్పత్తులు రోగులకు ఎంతో సురక్షితమైనవని, డ్రగ్‌ కంట్రోల్‌ బోర్డు మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

"మెట్‌ఫార్మిన్‌ హైడ్రోక్లోరిన్‌ ఎక్స్‌టెండెడ్‌ ట్యాబ్లెట్లకు సంబంధించిన ఉత్పత్తులలో గుర్తించబడిన సమస్యలు పరిష్కరించదగినవని మేం నమ్ముతున్నాం. ప్రస్తుతం త్రైమాసికంలో అమెరికాలో ఈ అప్‌డేట్‌ప్రోడక్ట్స్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం" అని లుపిన్‌ ఒక ప్రకటనను విడుల చేసింది.

Similar News