కరోనా మహత్యం.. దొంగలు కూడా పీపీఈ కిట్లు ధరించి చోరీలు..

Update: 2020-07-08 17:02 GMT

మాస్క్ పెట్టుకుంటేనే గుర్తు పట్టడం కొంచెం కష్టమవుతుంది. ఇంక పీపీఈ కిట్ ధరిస్తే ఎవరో పోల్చుకోవడం ఎంతో కష్టం. ఇదే దొంగలకు కలిసొచ్చిన అదృష్టం. ఐడియా అదిరింది గురూ అని సలహా ఇచ్చిన వాడికి సలాం కొట్టి పీపీఈ కిట్ ధరించి చోరీకి బయల్దేరారు దొంగలు దర్జాగా. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ నగల దుకాణంలో ఇటీవల దొంగలు పడి 780 గ్రాముల బంగారాన్ని దోచుకుపోయారు. ఈ తతంగం అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రికార్డును పరిశీలించిన పోలీసులు షాకయ్యారు. వైద్యులు వేసుకునే పీపీఈ కిట్లు ధరించి దొంగలు చోరీకి పాల్పడ్డారని గుర్తించారు. గ్లవ్స్, ప్లాస్టిక్ కోట్, హెల్మెట్ అన్నీ ధరించి పగడ్భందీగా ప్లాన్ వేసుకుని వచ్చి దోచుకుపోయారని తెలుసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News