సమంత బిజీ.. ఇల్లు క్లీన్ చేసే లిక్విడ్ తయారు చేస్తూ..

Update: 2020-07-10 17:39 GMT

షూటింగ్స్ ఉంటే చాలా బిజీ. ఇప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే బోర్. ఏదైనా కొత్తగా ట్రై చేయాలి. అది మనసుకి ఎంతో తృప్తిగా అనిపించాలి.. అభిమానులకు మరింత చేరువ చేసేదిగా ఉండాలి.. నలుగురికీ ఉపయోగపడాలి.. ఎంత మంచి ఆలోచన.. అక్కినేని వారింటి కోడలైనా ఓ మామూలు అమ్మాయిలానే ఆలోచిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన పడుతుంటుంది. చైతూకి స్వయంగా వండి పెట్టాలని ప్రముఖ చెఫ్ దగ్గర పాకశాస్త్రంలో ప్రావిణ్యం సంపాదించింది. టెర్రస్ మీద కూరగాయలు పండించడం, ఆన్ లైన్ లో నటనకు సంబంధించిన మరిన్ని మెళకువలు తెలుసుకోవడం.. తాజాగా ఇల్లు, బాత్ రూమ్ లు క్లీన్ చేసే లిక్విడ్ తయారీలో నిమగ్నమవడం.. సమంతకే సాధ్యమని నిరూపిస్తోంది. ఇంటిని శుభ్రం చేసేందుకు ఎలాంటి రసాయనాలు వాడకుండా వీటితోనే క్లీన్ చేసుకోవచ్చని చెబుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.

 

Similar News