నటి కుటుంబంలో కరోనా..

Update: 2020-07-11 17:13 GMT

బెంగాలీ నటి కోయల్ మల్లిక్ కరోనా బారిన పడ్డారు. ఆమె తండ్రి రంజిత్ మల్లిక్ ప్రముఖ బెంగాలీ నటుడు ఆయన కూడా కొవిడ్ బారిన పడ్డారు. తల్లి దీపా మల్లిక్, కోయల్ భర్త నిర్మాత నిస్సాల్ సింగ్ సహా కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం అందరం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నామని తెలిపారు. ఘోర్ అండ్ బైరే, ఛాయా ఓ ఛాబీ చిత్రాల ద్వారా కోయల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో నిర్మాత నిస్సాల్ సింగ్ ని పెళ్లి చేసుకున్న కోయల్ ఈ ఏడాది మే నెలలో బాబుకు జన్మనిచ్చింది. ఆ సంతోష సమయాన్ని అభిమానులతో పంచుకున్న కొద్ది రోజులకే కొవిడ్ బారిన పడినట్లు ప్రకటించింది. కోయల్ కుటుంబం కొవిడ్ బారిన పడడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు.. దర్శక నిర్మాత సత్యజిత్ సేన్, నటులు విక్రమ్ ఛటర్జీ, జీత్ సహా పలువురు బెంగాలీ నటులు కోయల్ కుటుంబం కొవిడ్ నుంచి త్వరగా కొలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Similar News