100 సంవత్సరాలలో 'కరోనా' ద్వారా అతిపెద్ద సంక్షోభం : ఆర్బీఐ గవర్నర్

Update: 2020-07-11 16:10 GMT

గత 100 సంవత్సరాలలో కోవిడ్ -19 అతిపెద్ద సంక్షోభం సృష్టించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాపడ్డారు. శనివారం 7వ ఎస్‌బిఐ బ్యాంకింగ్ & ఎకనామిక్స్ కాన్క్లేవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంక్షోభం ముఖ్యంగా ఉత్పత్తి , ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కార్మిక-మూలధన ఉద్యమాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు.

ఆర్బీఐ ముఖ్యంగా వృద్ధి , ఆర్థిక స్థిరత్వం రెండింటికీ ప్రాధాన్యత ఇస్తోందని, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడానికి అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఆంక్షలను సడలించడంతో, భారత ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి వెళ్ళే సంకేతాలను చూపిస్తోందని తెలిపారు.

Similar News