మనం హద్దులు దాటితే.. ప్రజలు బుద్ధి చెబుతారు: శరద్ పవార్

Update: 2020-07-11 18:05 GMT

ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు‌. రాజకీయనాయకులకు అతి విశ్వాసం పనికి రాదని అన్నారు. సామ్నా పత్రికకు ఇంటర్వూ ఇచ్చిన ఆయన.. తాము తిరిగి అధికారంలోకి వస్తామన్న దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలపై స్పందించారు. బీజేపీ అహంకార పూరింతగా వ్యవహరించిందని ప్రజలు భావించి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. జాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని.. ఓటర్లు పట్టించుకోని పక్షంలో రాజకీయకులు మట్టిలో కలిసిపోతారని అన్నారు. అశేష ఆదరణ ఉన్న ఇందిరాగాంధీ, వాజ్‌‌పాయ్ లాంటి వారికే ఓటమి తప్పలేదని అన్నారు. రాజకీయ నాయకులు కంటే సామాన్యుడు చాలా తెలివిగా ఆలోచిస్తాడని.. మనం హద్దులు దాటితే.. ప్రజలు బుద్ధి చెబుతారని శరద్ పవార్ హెచ్చరించారు.

శివసేన కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సెంటిమెంట్ ప్రకారం ఓట్లు వేశారని.. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజల ఆలోచనలు మారాయని అన్నారు.

Similar News