ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ.. పార్టీ లోక్‌సభ సభ్యులతో సమావేశం అయ్యారు. కరోనా నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలు.. దేశంలోని రాజకీయ పరిస్థితిపై చర్చించారు. కరోనా కట్టడిలో, లాక్‌డౌన్ సమయంలో దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ మొదటి నుంచి విమర్శిస్తుంది. నిరుపేదలకు నేరుగా నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తుంది. చైనాతో సరిహద్దు వివాదంలోని వాస్తవ పరిస్థితులు ప్రజలముందు ఉంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది. అటు పెట్రోల్, ఢీజిల్ ధరలు పెరుగుదలపై కాంగ్రెస్ గత కొంతకాలంగా నిరసిస్తుంది. పలు అంశాలపై పార్లమెంట్ లో చర్చ జరగాలని.. కానీ, ప్రభుత్వం ఈ అంశాలు చర్చకు రాకుండా చేస్తుందని విమర్శిస్తుంది.